ఆంధ్రప్రదేశ్ పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) ఏకగ్రీవాలతో దూసుకెళ్లింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల హోరు కనిపిస్తుండగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నడూ లేనివిధంగా మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది.

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. అలాగే మొత్తం 7 జడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలను కూటమి ఇప్పటికే కైవసం చేసుకుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించింది.
వేంపల్లి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 15, భారతీయ జనతా పార్టీ 1, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కేవలం అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగనుంది.
పులివెందుల మండలంలో ఇక్కడి 5 ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. వేముల మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించింది. చక్రాయపేట మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలనూ కూటమి ఏకగ్రీవం చేసుకుంది. తొండూరు మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ వశమయ్యాయి. సింహాద్రిపురం మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు.
మరోవైపు రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ అధికార కూటమి ఏకగ్రీవాల జోరు కొనసాగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవి యాదమర్రి జడ్పీటీసీ యశోద, బంగారుపాళెం జడ్పీటీసీ సుచిత్ర జయప్రకాష్, పూతలపట్టు జడ్పీటీసీ శైలజ తేజో మూర్తి.
{{/usCountry}}మరోవైపు రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ అధికార కూటమి ఏకగ్రీవాల జోరు కొనసాగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవి యాదమర్రి జడ్పీటీసీ యశోద, బంగారుపాళెం జడ్పీటీసీ సుచిత్ర జయప్రకాష్, పూతలపట్టు జడ్పీటీసీ శైలజ తేజో మూర్తి.
{{/usCountry}}నంద్యాల జిల్లాలో సైతం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి తీవ్ర నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 జడ్పీటీసీ స్థానాలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల జడ్పీటీసీ స్థానాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి.
డోన్ నియోజకవర్గంలో బేతంచెర్ల, ప్యాపిలి జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు జడ్పీటీసీ స్థానాన్ని కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. పులివెందుల లాంటి వైసీపీ బలమైన స్థానాల్లో కూటమి సాధించిన ఈ ఏకగ్రీవ విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.