ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, రెగ్యులర్ కళాశాలలకు వెళ్లలేని విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అప్డేట్ వచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా…. అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును అధికారులు అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వర్సిటీ పలు కీలక యూజీ కోర్సులను డిజైన్ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ , బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc - ఎంపీసీ, ఎంపీసీఎస్ విభాగాల్లో) కోర్సులతో పాటు ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISc) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అర్హతలు - నిబంధనలు:
ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మీడియట్, 10+2 (నేషనల్/ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ - NIOS/APOS), పాలిటెక్నిక్ డిప్లొమా, లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి.
ప్రవేశాలు కోరే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన యూజీసీ-డిఇబి నిబంధనలకు లోబడి ఉండాలి. దీని ప్రకారం అభ్యర్థులు తమ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC-ID) తో పాటు DEB-ID ని తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి సంవత్సరం సాధారణ డిగ్రీ కోర్సులకు ట్యూషన్ ఫీజును రూ. 3,300 గా నిర్ణయించారు. అయితే సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఎంచుకునే అభ్యర్థులు ప్రాక్టికల్స్ నిమిత్తం అదనంగా లాబ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీకి విస్తరించి ఉన్న 73 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు, స్టడీ మెటీరియల్ పంపిణీ సేవలను విశ్వవిద్యాలయం అందిస్తోంది.
{{/usCountry}}మొదటి సంవత్సరం సాధారణ డిగ్రీ కోర్సులకు ట్యూషన్ ఫీజును రూ. 3,300 గా నిర్ణయించారు. అయితే సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఎంచుకునే అభ్యర్థులు ప్రాక్టికల్స్ నిమిత్తం అదనంగా లాబ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీకి విస్తరించి ఉన్న 73 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు, స్టడీ మెటీరియల్ పంపిణీ సేవలను విశ్వవిద్యాలయం అందిస్తోంది.
{{/usCountry}}ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ www.drbraouap.ac.in ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని వర్సిటీ యంత్రాంగం స్పష్టం చేసింది.