ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 2026-27 వార్షిక బడ్జెట్ పై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. (శనివారం) ఉదయం 11.15 గంటలకు రాష్ట్ర ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు శాసనమండలి ముందుకు కూడా పద్దును తీసుకువస్తారు.

ఈసారి దాదాపు రూ 3.45 నుంచి 3.50 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో కూడా ప్రజా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆడబిడ్డ నిధి స్కీమ్ పై కీలక ప్రకటన ఉండొచ్చని సమాచారం.
ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులుకు భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉండొచ్చు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం - నల్లమల సాగర్ అనుసంధానంపై కూడా ముఖ్యమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసే సూచనలున్నాయి. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.
మార్చి 7 వరకు సమావేశాలు…!
మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు.
{{/usCountry}}మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు.
{{/usCountry}}ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ఫిబ్రవరి 17, 18 తేదీల్లో చర్చిస్తారు. మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 18వ తేదీన బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానాలు ఇస్తారు.