AP Budget 2026 : ఏపీ బడ్జెట్ - భారీగానే అంచనాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం(ఫిబ్రవరి 14) ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 

Published on: Feb 13, 2026 5:42 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 2026-27 వార్షిక బడ్జెట్ పై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. (శనివారం) ఉదయం 11.15 గంటలకు రాష్ట్ర ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు శాసనమండలి ముందుకు కూడా పద్దును తీసుకువస్తారు.

ఏపీ బడ్జెట్
ఏపీ బడ్జెట్

ఈసారి దాదాపు రూ 3.45 నుంచి 3.50 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో కూడా ప్రజా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆడబిడ్డ నిధి స్కీమ్ పై కీలక ప్రకటన ఉండొచ్చని సమాచారం.

ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులుకు భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉండొచ్చు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం - నల్లమల సాగర్ అనుసంధానంపై కూడా ముఖ్యమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసే సూచనలున్నాయి. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

మార్చి 7 వరకు సమావేశాలు…!

మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ఫిబ్రవరి 17, 18 తేదీల్లో చర్చిస్తారు. మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 18వ తేదీన బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానాలు ఇస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More