Tungabhadra Project Gates : తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు సైతం అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ఈ డ్యాంకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను జూన్ 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ కూడా పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల జీవనాడిగా అభివర్ణించిన అధికారిక యంత్రాంగం…. కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారిందని వెల్లడించింది.
33 కొత్త గేట్లు….

మొత్తం రూ. 51 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఇంజినీరింగ్ నిపుణులు విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తుంగభద్ర ప్రాజెక్టు మూడు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తూ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదల సమయంలో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ ఊహించని ప్రమాదం ప్రాజెక్టు భద్రతతో పాటు నీటి నిర్వహణపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృథా కాకుండా నిరోధించేందుకు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్-లాక్ గేటును విజయవంతంగా అమర్చింది.
ఈ ప్రమాదం తర్వాత రంగంలోకి దిగిన జాతీయ డ్యాం భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రాజెక్టు రక్షణను పరిగణనలోకి తీసుకుని, డ్యాంలోని అన్ని స్పిల్‌వే గేట్లను పూర్తిగా మార్చాలని సిఫార్సు చేసింది. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా శరవేగంతో చర్యలు చేపట్టాయి. నిర్దేశిత కాలపరిమితిలోగా పాత గేట్ల స్థానంలో సరికొత్త గేట్ల అమరికను పూర్తి చేసి….. ఈ కీలకమైన సాగునీటి మౌలిక సదుపాయాన్ని పునరుద్ధరించాయి.
తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటిని, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 1.46 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్ల మార్పిడిని పూర్తి చేశాయి.
{{/usCountry}}తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటిని, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 1.46 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్ల మార్పిడిని పూర్తి చేశాయి.
{{/usCountry}}