పోలవరంతో పాటు ఇతర కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణానికి సకాలంలో నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు.
వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేసేలా….

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కారించాలని సీఎం కోరారు. ఆ రెండు రాష్ట్రాల్లో పోలవరం నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం అబెయన్సులో ఉన్నప్పటికీ... దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 3 రాష్ట్రాల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని… పరస్పర సహకారం, సమన్వయం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నిధులు ఆపకండి - సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్రమంత్రికి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో... నిర్వాసితుల సమస్యల పరిష్కారం.. పునరావాస పనులకూ అంతే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పోలవరానికి ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు… కేంద్ర మంత్రిని కోరారు.
{{/usCountry}}పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్రమంత్రికి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో... నిర్వాసితుల సమస్యల పరిష్కారం.. పునరావాస పనులకూ అంతే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పోలవరానికి ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు… కేంద్ర మంత్రిని కోరారు.
{{/usCountry}}పోలవరం వద్ద 45.72 కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. చేపట్టాల్సిన పనుల పైనా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. గోదావరి నది నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని.. ఆ నీటిని సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని వివరించారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇటీవలే ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉంటే... వాటిల్లో 62 లక్షల మంది ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని.. తాజాగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించేలా పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, పనులకు అనుగుణంగా సత్వరం నిధులు విడుదల చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.