ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం వమ్ము చేయలేదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలు, ప్రతిపక్ష వైకాపా తీరుపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూర్చే మెగా డీఎస్సీని నిలిపివేసేందుకు కోర్టుల చుట్టూ తిరిగారని, చివరికి రోడ్లను సైతం తవ్వుతూ తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ చేసిన అరాచకాలు, విధ్వంసకర రాజకీయాలు ప్రజల మనసుల నుంచి ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోవని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ వద్దకు తమ సొంత మీడియాను తీసుకెళ్లి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ నాటకాలు ఆడుతున్నారని, గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు పనులు చేయించడమే కాక వారిని జైలుకు పంపిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు.
కుప్పం, పిఠాపురం, పుంగనూరులతో పాటు పులివెందులలో నామినేషన్ కేంద్రాల వద్ద రాడ్లు, కత్తులతో రౌడీలను దించి భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, పంజాబ్, బెంగళూరు నుంచి గూండాలను రప్పించి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే నిజమైన అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు చైర్మన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సోషల్ రీ-ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 11 మేయర్ స్థానాలకు గానూ 11 వేర్వేరు కులాల వారిని బరిలోకి దించామని, అందులోనూ అధికంగా మహిళలకే అవకాశమిచ్చామని తెలిపారు. బీసీలకు 39 శాతం ఓటు బ్యాంకు ఉండగా, ఏకంగా 35.05 శాతం సీట్లను కేటాయించామని వివరించారు.
{{/usCountry}}ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సోషల్ రీ-ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 11 మేయర్ స్థానాలకు గానూ 11 వేర్వేరు కులాల వారిని బరిలోకి దించామని, అందులోనూ అధికంగా మహిళలకే అవకాశమిచ్చామని తెలిపారు. బీసీలకు 39 శాతం ఓటు బ్యాంకు ఉండగా, ఏకంగా 35.05 శాతం సీట్లను కేటాయించామని వివరించారు.
{{/usCountry}}గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను కోల్పోయిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని పునరుద్ధరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సుమారు రూ.లక్షన్నర కోట్లతో సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం నిర్దిష్ట సమయంలో లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాయలసీమ వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను పూర్తి చేశామని, మార్కాపురం ప్రాంతాన్ని కరవు రహితంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మళ్లించిన స్థానిక నిధులను, నిర్వీర్యం చేసిన జల్ జీవన్ మిషన్ వంటి 93 కేంద్ర పథకాలను కేంద్రంతో చర్చించి మళ్లీ గాడిన పెట్టామని తెలిపారు.
'రప్పా రప్పా రాజకీయాలు, ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేసే సంస్కృతి మనది కాదు. నా జీవితంలో హింసకు తావులేదు. కానీ రౌడీయిజంతో అధికారం దక్కించుకోవాలని చూస్తే మాత్రం సహించేది లేదు.' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగానైతే 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయాన్ని అందించారో, అదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి పరిపాలన కోసం కూటమికి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.