ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారంతో ముగిసింది. శాఖల వారీగా పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు…. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు చెప్పే నెంబర్లు నమ్మనని... ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమని చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని ఈ కాన్ఫరెన్స్ లో నిర్ణయించారు. కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు... అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచించారు. ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు.
రాజకీయ జోక్యాన్ని సహించకండి - సీఎం చంద్రబాబు
22ఏ భూముల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పని చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 22ఏ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టం చేశారు. ఏపీఐఐసీకి చెందిన 82 వేల ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లోని కొంత మంది రాజకీయ నేతలు భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్…. సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం… భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిలా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
“పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలి. ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలి. జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలి. రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ... ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}“పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను ఇకపై కొరియర్ ద్వారానే యాజమానులకు చేర్చాలి. ఉగాది నాటికి ఫ్యామిలీ కార్డ్ జారీ, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలి. జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలి. రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ... ఇతర రాష్ట్రాల నుంచి పెట్రోల్, డిజీల్ సహా ఇతర పరికరాలను కొనుగోలు చేయకుండా చూసేలా చర్యలు తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}శాంతి భద్రతల సమీక్షలో సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు." నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దొ. సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘంతోపాటు... పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలి. కన్విక్షిన్ రేటు పెరగాలి... క్రైమ్ రేటు తగ్గాలి. తీర భద్రతకు తక్షణం బోట్లు కొనుగోలు చేయాలి. వచ్చే సమావేశం నాటికి జిల్లాలోని టాప్-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధం అవుతాయి రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ, రౌడీయిజం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. విద్యుత్ సంస్థల్లో రూ.1,14,352 కోట్ల అప్పులు పేరుకుపోయాయి. రూ.1,25,633 కోట్ల మేర భారం డిస్కంలు, ట్రాన్స్ కోలపై పడింది.కూటమి అధికారంలోకి వచ్చాక రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించాం*విద్యత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించాం. ప్రజలపై భారం మోపబోవటం లేదు” అని చంద్రబాబు వెల్లడించారు.