సరికొత్త లోకంలో విహరిస్తూ మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. విలాసవంతమైన నౌక ‘కార్డేలియా క్రూయిజ్’ (Cordelia Cruise) మళ్లీ పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ వేదికగా ఈ సముద్ర విహార యాత్రలు పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకుల కోసం ఈ లగ్జరీ షిప్ ప్రయాణ తేదీలు, ప్యాకేజీలు, టికెట్ ధరల వివరాలు.
జూన్ 22 నుంచి సాగర విహారం

ఈ ఏడాది సముద్ర విహార సీజన్ జూన్ 22 నుండి ప్రారంభమై జూలై 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో విశాఖపట్నం - చెన్నై మధ్య ఈ భారీ నౌక ప్రయాణిస్తుంది. ఈ సీజన్‌లో వైజాగ్ నుండి చెన్నైకి నాలుగు సార్లు, అలాగే తిరుగు ప్రయాణంలో చెన్నై నుండి వైజాగ్‌కు నాలుగు సార్లు ఈ క్రూయిజ్ నడుస్తుంది. సాధారణంగా ఈ టూర్ ప్యాకేజీలు 3 రాత్రులు - 4 రోజులు (3 Nights / 4 Days) కాలపరిమితితో ఉంటాయి.
క్రూయిజ్ గురించి
విశాఖ తీరం నుంచి బయల్దేరే ఈ నౌక సముద్రం మీదుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మీదుగా చెన్నై చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రంపై తేలియాడే మినీ నగరం ఫీల్ ఉంటుంది. గతంలో 2022లో మొదటిసారిగా వైజాగ్-చెన్నై మధ్య ప్రయాణించిన ఈ నౌక, పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందింది. 692 అడుగుల పొడవు ఉండే ఈ భారీ నౌకలో 11 అంతస్తులు, 796 విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి.
ఒకేసారి సుమారు 1,600 నుండి 2,000 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్‌లో ప్రయాణమే కాకుండా వినోదానికి ఇక్కడ కొదవ లేదు. అంతర్జాతీయ స్థాయి థియేటర్లు, స్టాండప్ కామెడీ షోల కోసం ప్రత్యేక ఆడిటోరియం, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి. పిల్లల కోసం 'కార్డేలియా కిడ్స్ అకాడమీ', పెద్దల కోసం మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, క్యాసినో, 24 గంటల పాటు అందుబాటులో ఉండే సూపర్ మార్కెట్, గ్లోబల్ వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఇందులో కొలువుదీరాయి.
కార్డేలియా క్రూయిజ్ టికెట్ ధరలు
{{/usCountry}}ఒకేసారి సుమారు 1,600 నుండి 2,000 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్‌లో ప్రయాణమే కాకుండా వినోదానికి ఇక్కడ కొదవ లేదు. అంతర్జాతీయ స్థాయి థియేటర్లు, స్టాండప్ కామెడీ షోల కోసం ప్రత్యేక ఆడిటోరియం, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి. పిల్లల కోసం 'కార్డేలియా కిడ్స్ అకాడమీ', పెద్దల కోసం మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, క్యాసినో, 24 గంటల పాటు అందుబాటులో ఉండే సూపర్ మార్కెట్, గ్లోబల్ వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఇందులో కొలువుదీరాయి.
కార్డేలియా క్రూయిజ్ టికెట్ ధరలు
{{/usCountry}}మీరు ఎంచుకునే గదుల (క్యాబిన్) కేటగిరీని బట్టి ధరలు మారుతుంటాయి. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటీరియర్ క్యాబిన్ల నుండి అత్యంత విలాసవంతమైన ఛైర్మన్ సూట్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఒకరికి (ఇంటీరియర్ క్యాబిన్) రూ. 22,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది. 2 రాత్రుల ప్యాకేజ్ ఇద్దరికిరూ. 48,000 వరకు, 3 రాత్రుల ప్యాకేజ్ ఇద్దరికిరూ. 70,000 వరకు దొరుకుతుంది. బాల్కనీ, సూట్ రూమ్స్ డిమాండ్‌ను బట్టి (అల్ట్రా లగ్జరీ)రూ. 80,000 పైగా ఉంటుంది.
ఈ అద్భుతమైన సముద్ర ప్రయాణానికి సంబంధించిన టికెట్లు అన్ని ప్రముఖ గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీలలోనూ అందుబాటులో ఉంటాయని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ తెలిపింది. వేసవి ముగింపు వేళ ఫ్యామిలీతో కలిసి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీని సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే మీ టికెట్లను రిజర్వ్ చేసుకోండి.