...
...
Next Story

AP Municipal Election Results : నేడు ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎస్ఈసీ సర్వం సిద్ధం చేసింది. 138 కేంద్రాల్లో 47,817 మంది సిబ్బందితో లెక్కింపు ప్రక్రియ జరగనుంది. 10,262 మంది అభ్యర్థుల జాతకం తేలనుంది.

Published on: Nov 3, 2026, 04:48:40 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో పడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఉదయం 8 నుంచి కౌంటింగ్…

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (AI Image Gemini)
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (AI Image Gemini)

ఇవాళ ఉదయం 8:00 గంటల నుంచే లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు… ఫలితాల వెల్లడి వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికార కూటమి సమాయత్తమవ్వగా, ప్రతిపక్షం కూడా తమ కౌంటింగ్ ఏజెంట్లకు, పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తూ అలెర్ట్ చేసింది.

మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్ ప్రక్రియ ముగియగా, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటి పరిధిలో 556 కౌంటింగ్ హాళ్లను నిర్మించి, మొత్తం 6,831 కౌంటింగ్ టేబుళ్లను అందుబాటులోకి తెచ్చారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీ ఎత్తున మానవ వనరులను వినియోగిస్తున్నారు.

  • కౌంటింగ్ పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు : 6,831 మందిప్రధాన
  • కౌంటింగ్ సిబ్బంది: 13,662 మంది
  • కౌంటింగ్ సహాయకులు (అసిస్టెంట్లు): 27,324 మంది

మొత్తంగా 47,817 మంది అధికారులు, సిబ్బంది ఈ కౌంటింగ్ పర్వంలో పాల్గొంటున్నారు. మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల పరిధిలోనే 2,805 టేబుళ్లను ప్రత్యేకంగా కేటాయించారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లకు గానూ 118 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లోని 3,020 వార్డుల్లో 637 స్థానాలు ఏకగ్రీవంగా మారాయి. ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 2,382 వార్డుల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు మొత్తం 10,262 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి రాజకీయ భవితవ్యం కొన్ని గంటల్లోనే తేలనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks