ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), అతని భార్య శిరీష (28) కొన్నాళ్లుగా భీమవరంలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి వీరు చించినాడ వంతెనపైకి వచ్చి గోదావరి నదిలోకి దూకేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం రోజంతా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దంపతుల ఆచూకీ లభించలేదు.
రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సాయికృష్ణకు తాకట్టు పెట్టమని ఒక ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చే విషయంలో ఇరువురి మధ్య వ్యత్యాసాలు వచ్చాయి. గురువారం ఉదయం సదరు వ్యక్తి మరికొందరితో కలిసి వేల్పూరులోని సాయికృష్ణ ఇంటి దగ్గర గొడవ చేశారు. అనంతరం భీమవరంలోని వారి ఇంటికి వెళ్లి, కేవలం రూ. 50 వేల బకాయి కోసం దంపతులిద్దరినీ తీవ్ర పదజాలంతో దూషించారు. మానసిక చిత్రహింసలు తాళలేకే తమ కుమారుడు, కోడలు ఈ దారుణానికి ఒడిగట్టారని డీవీడీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆత్మహత్యకు ముందు సాయికృష్ణ రికార్డు చేసిన ఒక ఆడియో మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఉంగరం తిరిగి ఇచ్చేందుకు సమయం అడిగాం. మా అప్పులు తీర్చే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరని చెప్పినా వినకుండా, నా భార్యను ఇష్టానుసారంగా నిందించారు. ఇక భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు.' అని ఆ ఆడియోలో పేర్కొన్నాడు.
దీనికి తోడు, ఆత్మహత్యకు రెండు రోజుల ముందు సాయికృష్ణ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వేల్పూరులోని తమ కవల పిల్లల్లో ఒక పాపను తన వద్దకు పంపకపోతే ఫ్యాన్‌కు ఉరివేసుకుంటానని, కొందరు వ్యక్తులు తనను కించపరిచారని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
సాయికృష్ణ, శిరీష దంపతులు తమ కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకే వంతెన వద్దకు వచ్చారు. అయితే చివరి నిమిషంలో మనసు మారడంతో, కుమారుడిని బైక్‌పైనే ఉంచి దంపతులిద్దరూ నదిలోకి దూకేశారు. కళ్లముందే కన్నతల్లిదండ్రులు నీటి అలల్లో కొట్టుకుపోతుంటే ఆ పసివాడు పడిన వేదన స్థానికులను కలచివేసింది. పోలీసులు ప్రస్తుతం ఆ బాలుడిని మేనత్త రక్షణలో ఉంచారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియో ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
{{/usCountry}}సాయికృష్ణ, శిరీష దంపతులు తమ కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకే వంతెన వద్దకు వచ్చారు. అయితే చివరి నిమిషంలో మనసు మారడంతో, కుమారుడిని బైక్‌పైనే ఉంచి దంపతులిద్దరూ నదిలోకి దూకేశారు. కళ్లముందే కన్నతల్లిదండ్రులు నీటి అలల్లో కొట్టుకుపోతుంటే ఆ పసివాడు పడిన వేదన స్థానికులను కలచివేసింది. పోలీసులు ప్రస్తుతం ఆ బాలుడిని మేనత్త రక్షణలో ఉంచారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియో ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
{{/usCountry}}