వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజీ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటాతోపాటుగా ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

వైద్యారోగ్య రంగంలో ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు.
'గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలు సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్‌లోనే వారి వివరాలను తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పలు అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.' అని చంద్రబాబు తెలిపారు.
రోగం వచ్చినాక తీసుకునే జాగ్రత్తల కంటే ఆ జబ్బు రాకుండా ముందుగా నియంత్రించే ప్రివెంటీస్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు. దీనిద్వారా వైద్యారోగ్యంపై ఖర్చులను తక్కువగా చేసే అవకాశం ఉందన్నారు. ఆరోగ్య రంగంలో వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టడానికి అత్యున్నత స్థాయి ఎక్స్‌పర్ట్ గ్రూప్ సలహాలు ఇవ్వాలన్నారు. క్వాంటం, ఏఐతో రియల్ టైమ్ డేటా విశ్లేషణలాంటి వాటితో ప్రజలకు సేవలు అందాలని చంద్రబాబు అన్నారు. గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ప్రస్తుతం సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు.
'2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా అంతిమంగా ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. యోగాతోపాటుగా నేచురోపతిని ప్రోత్సహించాలి. ప్రివెంటీస్ వెల్నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలి. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
{{/usCountry}}'2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా అంతిమంగా ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. యోగాతోపాటుగా నేచురోపతిని ప్రోత్సహించాలి. ప్రివెంటీస్ వెల్నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలి. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
{{/usCountry}}