ఏపీకి తుపాను ముప్పుతో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వానలు పడనున్నాయి. తుపాను కారణంగా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురవనున్నాయి.

Published on: Oct 25, 2025, 16:18:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావం తెలంగాణలోనూ ఉండనుంది. ముంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన తీవ్రమైన తుపానుగా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నేటి నుంచి అక్టోబర్ 28వ తేదీ దాగా రాష్ట్రంలో తుపాను ప్రభావం భారీగా ఉండనుంది.

ఏపీకి తుపాను ప్రభావం
ఏపీకి తుపాను ప్రభావం

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపించనుంది. తీర ప్రాంతంలోని విద్యా సంస్థలకు 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. తీర ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ తుపాను కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య దాటుతుందని, గాలుల వేగం గంటకు 90-100 కి.మీ.లకు చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఇప్పటికే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. రాబోయే ఐదారు రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. అక్టోబర్ 27, 28 తేదీలలో రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉన్నందున అక్టోబర్ 27 నుండి 29 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం తుపానుగా మారిన తర్వాత అక్టోబర్ 27 సాయంత్రం నుండి పరిస్థితి మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28న తీరం దాటనుంది. దీనితో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపాతం అక్టోబర్ 29 వరకు కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More