మెుంథా తీవ్ర తుపానుగా బలపడింది. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీవ్ర తుపాను మారిన మెుంథా ఏపీ వైపు దూసుకువస్తోంది. దీంతో పరిస్థితులు గంటగంటకు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలో మీటర్లు వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదిలిందన విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నాడు 18 గంటలపాటు తుపాను ఎఫెక్ట్ కనిపించనుంది.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి నాటికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో తుపాను బీభత్సం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్టంగా 110 కిలో మీటర్ల వేగంతో, ఇతర ప్రాంతాల్లో 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇక విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరిక ఇచ్చింది.
ఇక కొనసీమ జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. కాకినాడ జిల్లాలోని తీరంలో అలల ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. తుపాను ప్రభావంతో విశాఖలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రైళ్లు, విమాన సర్వీసులు రద్దు చేశారు. విజయవాడలోనూ వర్షం జోరుగా పడుతుంది. బాపట్ల, ప్రకాశ, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు.. ఇలా అన్ని జిల్లాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు.
మెుంథా తుపాను తీరానికి దగ్గరగా కదులుతున్నందున తీరప్రాంతాలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, నష్టాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల నివాసితులను ఎటువంటి ఆలస్యం లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఆహారం, సురక్షితమైన తాగునీటిని అందించాలని, పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.
{{/usCountry}}మెుంథా తుపాను తీరానికి దగ్గరగా కదులుతున్నందున తీరప్రాంతాలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, నష్టాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల నివాసితులను ఎటువంటి ఆలస్యం లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఆహారం, సురక్షితమైన తాగునీటిని అందించాలని, పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.
{{/usCountry}}