బంగాళాఖాతంలో వాయుగుండం.. రాబోయే 4 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాబోయే 4 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Updated on: Sep 21, 2026, 21:25:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాబోయే 4 రోజులు కోస్తాంధ్రతో పాటు పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ముందస్తు సూచనలు జారీ చేసింది.

వెదర్ అప్డేట్
వెదర్ అప్డేట్

22వ తేదీ ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

23వ తేదీ వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు కూడా హెచ్చరిక కొనసాగుతుంది.

24వ తేదీ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, యానాంలో కూడా వర్షాలు పడనున్నాయి. అందుకే రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుంది.

ఇక రాబోయే 4 రోజులు సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున, వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి తిరిగిరావాలని అధికారులు స్పష్టం చేశారు. అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం సురక్షితమని చెప్పారు.

తిరుపతిలో సోమవారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 21, 2026) రెండు గంటల కంటే తక్కువ సేపు కురిసిన ఎడతెరిపి లేని వర్షం ఎండ నుండి ఎంతో ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు రాత్రి పొద్దుపోయే వరకు జలమయమయ్యాయి.

ఈ ఆకస్మిక వర్షం రైల్వే స్టేషన్, ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టేషన్, పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, తాతాయగుంట గంగమ్మ గుడి, గ్రూప్ థియేటర్లు వంటి వర్షపు నీటితో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు మోకాలి లోతు నీటిలో నడవవలసి వచ్చింది. భారీ వర్షం కంటే, మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తే సమస్యకు కారణమని, దానివల్ల బురద నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోందని స్థానికులు ఆరోపించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More