...
...
Next Story

AP Cabinet Meeting : సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ - పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

Published on: Nov 10, 2026, 12:47:44 IST
Advertisement

రాష్ట్ర మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశం గురువారం ఉదయం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమగ్ర సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రివర్గ సహచరులందరూ పాల్గొన్నారు.

కీలక అంశాలపై ఫోకస్…

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న క్యాబినెట్ హాల్‌లో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజా సమస్యల పరిష్కారం, శాఖల వారీగా అమలువుతున్న ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కీలక నిర్ణయాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.

అభివృద్ధి పనుల వేగవంతం, నూతన విధానాల రూపకల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతి రాజధాని పనులు, పారిశ్రామిక పురోగతిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా….. రాష్ట్రానికి మేలు చేకూర్చే పలు ప్రతిపాదనలకు ఈ మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

భార్యతో విడాకులు - కీలక ప్రకటన :

పవన్ కళ్యాణ్, అన్నా దంపతులు తమ విడాకుల గురించి సోమవారం (నవంబర్ 9) రాత్రి ఒక జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు. "మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు... మా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కలిసి పంచుకున్న తర్వాత పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మేమిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతాం. మా పిల్లలకు ఎప్పటికీ అంకితభావం గల తల్లిదండ్రులుగా ఉంటాం. వారి సంతోషం, శ్రేయస్సే మా ఇద్దరి మొదటి ప్రాధాన్యత" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, అభిమానులను పవన్, అన్నా కొణిదెల కోరారు. విడాకుల ప్రక్రియ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, దయచేసి అందరూ ఈ కష్ట సమయంలో తమను అర్థం చేసుకుని దయతో వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్… కేబినెట్ భేటీకి హాజరవుతారా..? లేదా..? అన్న చర్చ జరిగింది. అయితే ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి కేబినెట్ భేటీకి హాజరయ్యారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks