తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మార్చి నెలలోని విశేష పర్వదినాలు, లిస్ట్ ఇదే

Tirumala March Month Festivals 2026: శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. మార్చి నెలలో జరిగే విశేష పర్వదినాలను పేర్కొంది. మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఉండనుంది.

Published on: Feb 27, 2026, 17:15:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. మార్చి 2వతేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ముగింపు ఉంటుంది. మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 27న శ్రీరామనవమి ఆస్థానం ఉంటుందని వివరించింది.

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మార్చి నెలలో విశేష పర్వదినాలివే
తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మార్చి నెలలో విశేష పర్వదినాలివే

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు:

  • మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.
  • మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
  • మార్చి 15న వైష్ణవ ఏకాదశి.
  • మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
  • మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.
  • మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
  • మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.

చంద్రగ్రహణం రోజు ఆలయం మూసివేత:

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు.

మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది.

ఇక మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి మరియు తిరుచానూరులోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు.

ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, అలాగే శ్రీనివాసం మరియు విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు మరియు వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు మరియు వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More