తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు భక్తులు నగదు రూపంలో ఇస్తే మరికొందరు భక్తులు… చెక్కులు, బంగారం, వెండి రూపంలో చెల్లిస్తుంటారు. అయితే హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు… మరో రూపంలో టీటీడీకి విరాళం అందించారు. రూ.78 లక్షల విలువైన మందులను విరాళంగా ఇచ్చారు.

ఈ మందులను గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు… ఆ సంస్థ అధినేతలు చక్రధర్, శివరంజని అందజేశారు. విరాళంగా ఇచ్చిన మందులను టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో యాత్రికులు, రోగులకు అందించే వైద్య సేవలకు ఉపయోగిస్తామని టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ పాల్గొన్నారు.
మరోవైపు చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకి అందించారు.
విశేష పర్వదినాలు:
ఇక జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి….
• జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
• జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
• జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
• జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
• జనవరి 14న భోగి.
{{/usCountry}}• జనవరి 14న భోగి.
{{/usCountry}}• జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
• జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
• జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
• జనవరి 23న వసంత పంచమి.
• జనవరి 25న రథ సప్తమి.