టీటీడీ : నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులూ మీ వెంట ఇవి తప్పనిసరి!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అంతా సిద్ధమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు చెరుకుంటాయి.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుకుంటాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. మెుదటి మూడు రోజులు.. ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఇప్పటికే ఈ డిప్ విధానంలో టోకెన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టోకెన్లు ఉన్నవారికి దర్శనం ఉంటుందని చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పింది.

మెుదటి మూడు రోజులు ఈ డిప్ ద్వారా టోకెన్లతో వచ్చిన భక్తులకు దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉంటుంది టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే వెల్లడించారు. మెుదటి మూడు రోజులు ఈ డిప్ విధానంలో టోకెన్లు, మిగిలిన రోజుల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 15 వేలు, శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు వెయ్యి చొప్పున జారీ అయ్యాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినం మంగళవారం రోజున ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. బుధవారం ద్వాదశి రోజున వేకుజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుంది. మెుదటి మూడు రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. భక్తులు ఆధార్ కార్డుతోపాటుగా టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలి. ఇతర భక్తులకు టోకెన్ బదిలీ చేయకూడదు, టోకెన్ మీద పేర్కొన్న ప్రదేశానికి, నిర్దేశిత సమయానికి రిపోర్ట్ చేయాలని టీటీడీ తెలిపింది.
మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్ టోకెన్ పొందిన భక్తులు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి అనుమతి ఇస్తారు. ఇక ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల టోకెన్ ఉన్న భక్తులు ఏటీజీహెచ్ నుంచి అనుమతి, 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా అనుమతి ఇస్తారు.
జనవరి 2 నుంచి 8 వరకు ఎటువంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని టీటీడీ ఇప్పటికే వెల్లడించింది. చివరి మూడు రోజులు స్థానికులకు రోజుకు 5 వేల మంది చొప్పున ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


