తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - సామాన్య భక్తులకు ఈనెల 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం..!

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం కల్పించనుంది. భక్తులు సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.

Published on: Jan 2, 2026, 17:09:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. భక్తులను జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి వెల్లడించారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

జనవరి 8 వరకు సర్వదర్శనం….

తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ… వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు.

జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు.

టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు.

అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More