Lunar Eclipse Today : వీడిన సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ అద్భుతమైన ఫొటోలు చూడండి

Blood Moon 2026 : భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం వీడింది.

Published on: Mar 3, 2026, 19:59:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో మధ్యాహ్నం 3.20 గంటలకు మెుదలైన చంద్రగ్రహణం ముగిసింది. సాయంత్రం 6.47కు గ్రహణం వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సైతం గ్రహణం చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. అయితే కొంతమంది గ్రహణం సమయంలో సాయంత్రంపూట బయటకు ఎక్కువగా రాలేదు.

చంద్రగ్రహణం 2026
చంద్రగ్రహణం 2026

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చంద్రగ్రహణాన్ని 6.20 నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌, కాలిఫోర్నియాలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనువిందు చేసింది.

ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం దాదాపు 3 గంటల 26 నిమిషాల పాటు కొనసాగింది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కనిపించింది.

చంద్రగ్రహణం తర్వాత స్నానం చేయడం, దానం చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఇది మానసిక అశాంతి, ప్రతికూలత, బాధలను తగ్గిస్తుందని, కుటుంబంలో ఆనందం, శాంతిని కొనసాగిస్తుందని నమ్ముతారు. గ్రహణం విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 48 నిమిషాల తర్వాత చేయాలి. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

పౌరాణిక నమ్మకాల ప్రకారం, చంద్రగ్రహణం తర్వాత గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయడం ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి దేవుడిని స్మరించాలి. దీని తర్వాత మాత్రమే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆచారం శారీరక, మానసిక శుద్ధిని సూచిస్తుంది. తెల్లని వస్తువులను, ఆహారపదార్థాలను దానం చేయాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More