ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ప్రచారంతో జనాలు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వల కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా పెట్రోల్, డీజిల్ దొరకదని ప్రచారం జరుగుతుండటంతో పెట్రోల్ బంకుల వద్దకు భారీగా తరలివెళ్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులు చేపల వేటకు వెళ్లడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ.. డీజిల్ కొరత కారణంగా పడవలు నిలిచిపోవడంతో గత 10 రోజులుగా చేపల వేట కార్యకలాపాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ పరిస్థితికి ప్రపంచ పరిణామాలు పాక్షికంగా కారణమని, దీంతో మత్స్యకారులకు పని లేకుండా పోయిందని అన్నారు.
ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ అసోసియేషన్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించినప్పటికీ.. సమస్య పరిష్కారం కాలేదని జానకిరామ్ పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘం కూడా తగినంత మద్దతు ఇవ్వలేదని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపల లభ్యత ఇప్పటికే తగ్గిపోయిందని, మరికొన్ని రోజుల్లో వేట నిషేధ కాలం వేగంగా సమీపిస్తోందన్నారు. రాయితీతో కూడిన డీజిల్ సకాలంలో సరఫరా కాకపోతే.. మత్స్యకారులు మరింత ఇబ్బందులు పడవచ్చు.
కేంద్ర ప్రభుత్వం మత్స్య రంగాన్ని పారిశ్రామిక వర్గం కింద చేర్చడం వల్ల మత్స్య రేవుల్లో డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 24 మేర పెరిగాయని జానకిరామ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఉపశమనం ఏదీ కల్పించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, మత్స్యకారుల కోసం డీజిల్ ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భూ కేటాయింపుపై కూడా జానకిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మత్స్యకారులను సంప్రదించకుండా సుమారు 28 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించారని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ దిశగా తీసుకునే ఏ చర్యపైనైనా సమీక్ష జరపాలని పిలుపునిచ్చారు. తమిళనాడు నుంచి చేపల పడవలు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కార్యకలాపాలు స్థానిక మత్స్యకారులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.
{{/usCountry}}జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భూ కేటాయింపుపై కూడా జానకిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మత్స్యకారులను సంప్రదించకుండా సుమారు 28 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించారని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ దిశగా తీసుకునే ఏ చర్యపైనైనా సమీక్ష జరపాలని పిలుపునిచ్చారు. తమిళనాడు నుంచి చేపల పడవలు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కార్యకలాపాలు స్థానిక మత్స్యకారులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.
{{/usCountry}}సబ్సిడీ డీజిల్ సకాలంలో అందకపోతే.. మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని జానకిరామ్ చెప్పారు. స్థానిక మత్స్యకారుల నుంచి ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా హార్బర్లను ప్రైవేటీకరించడం సమంజసం కాదని పేర్కొన్నారు.