ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్(DIMPLE) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విజయవాడలోని పటమట జీడీఈటీ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. విద్యా రంగంలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిని ఒకే గొడుగు కిందకు తెచ్చి మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖను ఏర్పాటు చేశామని, దీనివల్ల విద్యా రంగంలో సమన్వయంతో కూడిన మార్పులు సాధ్యమవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో డిజిటల్ ఏకీకరణ, ఉపాధ్యాయుల నియామకం, వృత్తిపరమైన శిక్షణ, అభ్యాస విధానాల ఆధునీకరణ ద్వారా విద్యను బలోపేతం చేసేందుకు 'లీప్' (LEAP - Learning Excellence in Andhra Pradesh) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగానే 'డింపిల్' పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు, దీని ఫలితాలను సమీక్షించిన తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీలకమైన ముందడుగు వేసిందని ప్రశంసించారు. అకడమిక్ విజయాలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా యువతలో ఒత్తిడిని పెంచుతోందని, ఈ నేపథ్యంలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే డిజిటల్ సాధనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రీబౌండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టాడ్ కింగ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పరిశోధనలు చేసిన తర్వాతే 'డింపిల్' ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన మానసిక ఆరోగ్య వనరులను గోప్యంగా పొందవచ్చని, అవసరమైనప్పుడు నిపుణులైన కౌన్సెలర్లను రహస్యంగా సంప్రదించవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ చొరవ భారత్‌తో పాటు దక్షిణ ఆసియా ప్రాంతంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}రీబౌండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టాడ్ కింగ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పరిశోధనలు చేసిన తర్వాతే 'డింపిల్' ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన మానసిక ఆరోగ్య వనరులను గోప్యంగా పొందవచ్చని, అవసరమైనప్పుడు నిపుణులైన కౌన్సెలర్లను రహస్యంగా సంప్రదించవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ చొరవ భారత్‌తో పాటు దక్షిణ ఆసియా ప్రాంతంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}