దీపావళి పండగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు చెప్పింది. పండగ రోజుల్లో రైళ్లలో పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని తగ్గించటంతో పాటు…. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు విశాఖపట్నం - పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము (MEMU) రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

వారాంతపు రోజులు, దీపావళి పండగ సమ్మేళనంతో ఈ మార్గంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 7, 8, 9 తేదీలలో మొత్తం మూడు సర్వీసులు ఈ ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది.
- విశాఖపట్నం - పార్వతీపురం (రైలు నంబర్ 07268): ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12:25 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
- పార్వతీపురం - విశాఖపట్నం (రైలు నంబర్ 07267): తిరుగు ప్రయాణంలో ఈ రైలు పార్వతీపురంలో మధ్యాహ్నం 12:35 గంటలకు బయలుదేరి, సాయంత్రం 04:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు:
ఈ ప్రత్యేక మెము రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకనవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైలు సర్వీసులతో ఉద్యోగులు, వ్యాపారులు, పండగకు స్వగ్రామాలకు వెళ్లే రోజువారీ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. సాధారణ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మెము రైలును ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
పాట్నాకు ప్రత్యేక రైళ్లు :
దీపావళి, ఛట్ పూజ పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ - పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
- విశాఖపట్నం - పాట్నా ప్రత్యేక ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 08588): ఈ ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రం 19:25 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు అంటే సోమవారం రాత్రి 20:00 గంటలకు పట్నా చేరుకుంటుంది. ఈ సర్వీసు నవంబర్ 15, 2026 మరియు నవంబర్ 22, 2026 తేదీలలో మొత్తం 2 ట్రిప్పులు అందుబాటులో ఉంటుంది.
- పాట్నా - విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 08587): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సోమవారం రాత్రి 21:50 గంటలకు పట్నాలో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 00:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ తిరుగు ప్రయాణ సర్వీస్ నవంబర్ 16, 2026 మరియు నవంబర్ 23, 2026 తేదీలలో 2 ట్రిప్పులు నడుస్తుంది.

ఈ రైళ్లు విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, బ్రహ్మపూర్ తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుంది.