...
...
Next Story

విశాఖపట్నం జూ పార్క్‌‌లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు

ఆగస్టు 9వ తేదీన విశాఖపట్నం జూ పార్క్‌‌లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్బంగా ఈ కార్యక్రమాన్ని జూ అధికారులు ఏర్పాటు చేశారు.

Published on: Aug 7, 2026, 13:51:27 IST
Advertisement

వరల్డ్ ఎలిఫెంట్ డే(ఆగస్టు 12) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం (ఆగస్టు 9, 2026) రోజున విద్యార్థుల కోసం చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలను నిర్వహించనున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.

వరల్డ్ ఎలిఫెంట్ డే డ్రాయింగ్ పోటీలు
వరల్డ్ ఎలిఫెంట్ డే డ్రాయింగ్ పోటీలు

జూపార్క్‌ ప్రాంగణంలోని జూ బయోస్కోప్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల విశిష్టతపై అవగాహన పెంచేందుకు ఈ పోటీలను మొత్తం మూడు విభాగాలుగా వర్గీకరించారు.

విభాగం-1 (1 నుంచి 5వ తరగతి విద్యార్థులు) ‘నా ఏనుగు - దాని సంరక్షకుడు’ (My Elephant and Its Keeper)

విభాగం-2 (6 నుంచి 10వ తరగతి విద్యార్థులు) ‘ఏనుగు: ఇండియా నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ - వన్యప్రాణుల రక్షణ, వారసత్వ పరిరక్షణ’

విభాగం-3 (ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్థులు) ‘మానవ-ఏనుగుల స్నేహం: సవాళ్లు, ఆవిష్కరణలు, శాశ్వత పరిష్కారాలు’

పోటీలో పాల్గొనే అభ్యర్థులకు డ్రాయింగ్ షీట్లను జూ యాజమాన్యమే ఉచితంగా అందిస్తుంది. పాల్గొనే విద్యార్థులు తమకు కావలసిన కలర్స్, పెన్సిళ్లు, ప్యాడ్లు మొదలైన ఇతర డ్రాయింగ్ మెటీరియల్‌ను స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ జూపార్క్ తరఫున సర్టిఫికేట్లు అందజేస్తారు.

ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలు, నిబంధనల కోసం జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను నేరుగా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం 7893632900ను సంప్రదించవచ్చు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇక్కడ దాదాపు 80కి పైగా జాతులకు చెందిన 800లకు పైగా జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. బెంగాల్ టైగర్, ఆసియా సింహాలు, చిరుతపులులు, ఆఫ్రికన్ ఏనుగులు, హిప్పోపోటమస్, జింకలు, అడవి దున్నలు చూడొచ్చు. నెమళ్ళు, రంగురంగుల చిలుకలు, నిప్పుకోళ్ళు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe