...
...
Next Story

గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మెడిసిన్ సప్లై.. వచ్చే నెల స్టార్ట్!

గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని కుదిరితే కొత్త ఏడాది మెుదట్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Dec 24, 2025, 21:15:15 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు మందులు, వ్యాక్సిన్‌లు, రక్త యూనిట్లను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు కేంద్రంగా పనిచేస్తూ, డ్రోన్ ఆధారిత వైద్య లాజిస్టిక్స్‌ను నిర్వహించడానికి ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ రెడ్ వింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెల చివరి నాటికి సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏర్పాటు ప్రకారం పాడేరు కేంద్రంగా ఈ వ్యవస్థ పని చేయనుంది. పాడేరు నుండి 60–80 కి.మీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(PHCలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCలు)కు డ్రోన్లు మందులు, రక్త యూనిట్లను సరఫరా చేస్తాయి. ప్రతి డ్రోన్ రెండు కిలోల వరకు బరువును మోయగలదు. సురక్షితమైన రవాణాను నిర్ధారించడానికి కోల్డ్-చైన్ సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది. ఈ కోల్డ్ వ్యవస్థతో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి.

ఈ డ్రోన్లు మందులను మాత్రమే తీసుకెళ్లడం కాకుండా రక్తం, మలం, మూత్ర నమూనాలను ఆరోగ్య కేంద్రాల నుండి ప్రయోగశాలలకు రోగనిర్ధారణ పరీక్షల కోసం రవాణా చేస్తాయి. క్లిష్టమైన నివేదికలను పొందడంలో సమయాన్ని తగ్గిస్తాయి. వెంటనే రిపోర్టులు పొందడంలో ఈ డ్రోన్ వ్యవస్థ సాయపడనుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులను నిర్వహిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ రెడ్ వింగ్‌.. ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ దశలో భాగంగా మొదటి ఆరు నుండి ఏడు నెలల వరకు ఉచితంగా సేవను అందిస్తుందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జి. వీరపాండ్యన్ తెలిపారు.

గిరిజన ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీ సమస్యలు ఉంటాయని, అలాంటివారికి వైద్య అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటానికి ఈ డ్రోన్ సిస్టమ్ సహాయపడుతుందని అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి నుండి పాడేరుకు మందుల రవాణా సేవను విస్తరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే నెలఖారు నుంచి ఈ సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks