ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల విక్రయంపై కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రముఖ సామాజిక వేత్త ఈఏఎస్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ను కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేసి, ఉపసంహరణ నిర్ణయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీపీఎస్ఈలలో (CPSEs) ప్రభుత్వ వాటాలు ప్రజా ప్రతినిధిగా రాష్ట్రపతి పేరిటే ఉంటాయని, కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీపీఎస్ఈల ప్రాధాన్యం - గణాంకాలు

దేశంలో ఉన్న 475 ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) ప్రజల తరఫున రాష్ట్రపతి పేరిట రూ.4,50,740 కోట్ల ఈక్విటీ వాటాలు ఉన్నాయని ఈఏఎస్ శర్మ తన లేఖలో గుర్తుచేశారు. ఈ సంస్థల్లో 7,81,552 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇవి ఏడాదికి రూ.3,08,674 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతో పాటు రూ.1,38,503 కోట్ల మేర డివిడెండ్లను ప్రకటిస్తున్నాయని విశ్లేషించారు.
'స్వతంత్ర విచారణ జరిపించాలి'
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి సంబంధించిన న్యాయబద్ధత, ఔచిత్యంపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించి, ఆ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచాలని ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఆ నివేదిక వచ్చే వరకు కెనడా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు యాజమాన్య బాధ్యతలు అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
"లోటు భర్తీకి నిధుల సేకరణ కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నామనడం సరికాదు. ప్రభుత్వ రంగాన్ని కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలు కూడా భారతీయ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకుంటున్నాయి" అని శర్మ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం సీపీఎస్ఈలు సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, ప్రైవేటీకరణ వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పారదర్శకత లేని విక్రయ ప్రక్రియ
కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు రూ.52,878 కోట్లకు ఐడీబీఐ బ్యాంక్‌ను కట్టబెడితే, కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీలు (LIC) కేవలం మైనారిటీ వాటాదారులుగా మిగిలిపోతారని విమర్శించారు. స్వదేశీ ప్రభుత్వ రంగ సంస్థలను వేలంలో పాల్గొనకుండా నిరోధించి, విదేశీ సంస్థకు తలుపులు బార్లా తెరవడం వెనుక పారదర్శకత లోపించిందని ఆరోపించారు. బ్యాంక్ ఆస్తుల విలువను లెక్కించిన ఏజెన్సీల వివరాలు, అనుసరించిన విధానాలను పార్లమెంట్‌కు కానీ, ప్రజలకు కానీ వెల్లడించలేదని ఆయన తప్పుపట్టారు.
ఎవరీ ఈఏఎస్ శర్మ?
ఈఏఎస్ శర్మ 1965 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి. కేంద్ర విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తన 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో విధానపరమైన విభేదాల కారణంగా ఆయన ఏకంగా 26 సార్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వ విధానాలతో విభేదిస్తూ నవంబర్ 2000లో ఆర్థిక శాఖ కార్యదర్శి పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు.
{{/usCountry}}ఈఏఎస్ శర్మ 1965 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి. కేంద్ర విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తన 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో విధానపరమైన విభేదాల కారణంగా ఆయన ఏకంగా 26 సార్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వ విధానాలతో విభేదిస్తూ నవంబర్ 2000లో ఆర్థిక శాఖ కార్యదర్శి పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు.
{{/usCountry}}అనంతరం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, డీమోనిటైజేషన్, నిర్వాసితుల సమస్యలు, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత వంటి అనేక ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం గళం విప్పుతున్నారు.