ఏపీ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.తిరుపతి – కొల్హాపూర్ - తిరుపతి మధ్య నడిచే ట్రైన్… ఇకపై కడప జిల్లాలోని నందలూరు రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కొత్త స్టాపేజీ…

తిరుపతి - కొల్హాపూర్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17415 ) కడప జిల్లాలని నందలూరు స్టేషన్లో ఆగుతుంది. అంతేకాకుండా కొల్హాపూర్ - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17416) రైలు కూడా ఈ స్టేషన్ లో ఆగనుంది. ప్రయోగత్మకంగా ఈ స్టాపేజీ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
ఈ కొత్త స్టాపేజీ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆరు నెలల పాటు ఈ స్టాపేజీ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తిరుపతితో పాటు మహారాష్ట్రకు వెళ్లే స్థానిక ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
తిరుపతి - కొల్హాపూర్ ట్రైన్ రాత్రి 09.30 గంటలకు బయల్దేరి… మరునాడు సాయంత్రం 04.35 నిమిషాలకు కొల్హాపూర్ కు చేరుతుంది. కొత్తగా స్టాపేజీగా ఉన్న నందలూరు రైల్వే స్టేషన్ కు రాత్రి 10.58 నిమిషాలకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు అక్కడ్నుంచి బయల్దేరుతుంది.
ఇక కొల్హాపూర్ నుంచి తిరుపతి వచ్చే ట్రైన్…. ఉదయం 11. 50 నిమిషాలకు బయల్దేరి… మరునాడు ఉదయం 08.15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా నందలూరు రైల్వే స్టేషన్ లో 2 నిమిషాలపాటు ఆగుతుంది.
ఈ ట్రైన్స్… తిరుపతి, రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు,హోసిపేట్, మునిరాబాద్, హుబ్లీ, దర్వార్, ఖానాపూర్, బెల్గావి, రాయ్ బాగ్, మిరాజ్ జంక్షన్, కొల్హాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}ఈ ట్రైన్స్… తిరుపతి, రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు,హోసిపేట్, మునిరాబాద్, హుబ్లీ, దర్వార్, ఖానాపూర్, బెల్గావి, రాయ్ బాగ్, మిరాజ్ జంక్షన్, కొల్హాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}