...
...
Next Story

విశాఖపట్నం-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌.. అరకు అందాలను చూస్తూ ప్రయాణం

Araku Train : అరకు రైలులో విస్టాడోమ్ కోచ్‌ను జతచేస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వెళ్లవచ్చు.

Published on: Oct 12, 2026, 15:12:04 IST
Advertisement

సెలవుల కారణంగా తూర్పు కనుమల వైపు ప్రయాణించేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అరకు రైలుగా ప్రసిద్ధి చెందిన రైలు నెం. 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్‌కు తాత్కాలికంగా ఒక అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జతచేస్తున్నట్లు దక్షిణ తీర రైల్వే (SCoR) ప్రకటించింది. దసరా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు glass-domed ఆకారంలో ఉండే ఈ కోచ్‌ను అక్టోబర్ 13 నుండి 20, 2026 వరకు ఈ సర్వీసుకు జతచేస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అడవులు, లోతైన లోయలు, సొరంగాల గుండా, బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ ప్రాంతం మీదుగా సాగే ఈ మార్గం పర్యాటకులను ఆకర్షిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ అదనపు విస్టాడోమ్ కోచ్ వెయిటింగ్ లిస్టులు తొలగిపోయి, కొత్తవలస-కిరండూల్ లైన్ వెంబడి ఉన్న దృశ్యాలను మరింత మంది పర్యాటకులు ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ సర్వీసును ఉపయోగించుకోవాలని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

విహారయాత్రల కోసం నిర్మించే LHB ఆధారిత విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లకు విద్యుత్ నియంత్రిత యాంటీ-గ్లేర్ స్క్రీన్‌లతో కూడిన గాజు పైకప్పు, విశాల దృశ్యాలను వీక్షించడానికి వీలుగా అదనపు పెద్ద సైడ్ కిటికీలు ఉంటాయి. వీటిలో 44 పుష్‌బ్యాక్ రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. ఇవి ప్రయాణ దిశ వైపు లేదా పరిసరాల వైపు చూసేందుకు 180 డిగ్రీల వరకు తిరుగుతాయి. దీంతో సీటులో కూర్చున్నవారు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ప్రయాణం చేయవచ్చు.

కోచ్ వెనక భాగంలో విశాలమైన కిటికీలతో ఉన్న అబ్జర్వేషన్ లాంజ్ నుండి వంతెనలు, చుట్టుపక్కల కొండల దృశ్యాలను చూడవచ్చు. ఇతర సౌకర్యాలలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, జీపీఎస్ ఆధారిత పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎల్ఈడీ లైటింగ్, మైక్రోవేవ్ ఓవెన్లు, కాఫీ మేకర్లతో కూడిన మినీ-ప్యాంట్రీలు, సీసీటీవీ నిఘా, బయో-టాయిలెట్లు, అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks