...
...
Next Story

తీరం దాటిన 'మురసు' తీవ్ర తుఫాన్ - బాపట్లలో అత్యధిక వర్షపాతం

తీవ్ర తుఫాన్ 'మురసు' మంగళవారం ఉదయం తీరం దాటింది. రాబోయే 12 గంటల పాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Published on: Nov 3, 2026, 11:46:31 IST
Advertisement

‘మురసు’ తీవ్ర తుపాను తుఫాన్ ఇవాళ ఉదయం 5:30 గంటలకు తీరం దాటింది. ఈ తుపానుకు సంబంధించిన వెనుక భాగం (Rear end) తీరం దాటే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తీరం దాటిన 'మురసు' తీవ్ర తుఫాన్
తీరం దాటిన 'మురసు' తీవ్ర తుఫాన్

గడిచిన ఆరు గంటల్లో దక్షిణ కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర తుఫాన్…. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశగా పయనించింది. మంగళవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఇది అదే ప్రాంతంలో స్థిరపడి ఉంది.

ఈ తీవ్ర తుఫాన్ మరింతగా ఉత్తర - ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నానికి క్రమంగా బలహీనపడి సాధారణ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 90 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆ తర్వాత మంగళవారం అర్ధరాత్రి నాటికి ఇది మరింత బలహీనపడి ‘తీవ్ర వాయుగుండం’గా మారనుందని…. ఆ సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.

వణికిపోతున్న దక్షిణ కోస్తాంధ్ర

తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర…. జిల్లాల్లో రాబోయే 12 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

సోమవారం ఉదయం 8:30 గంటల నుండి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు:

  • బాపట్ల: 222.4 మిమీ
  • నరసాపురం: 198.6 మిమీ
  • ఒంగోలు: 120.2 మిమీ
  • మచిలీపట్నం: 83.9 మిమీ
  • బండ్రవెల: 75 మిమీ
  • పుదుచ్చేరి: 65.4 మిమీ
  • చిలకపాడులో 104.50 మిమీ,
  • సంతనూతలపాడు 98.7మిమీ,
  • పశ్చిమగోదావరి (జి) మొగల్తూరులో 96మిమీ,
  • కోనసీమ(జి) మలికిపురం 93.7మిమీ వర్షపాతం నమోదు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks