పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశంలోని వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సప్లై చైన్ దెబ్బతినడంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల బస్తా ధర రకాన్ని బట్టి రూ. 2,000 నుండి రూ. 2,350కుపైగా పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎంత పెరిగినా కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుండటంతో యూరియా, డీఏపీ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. మే నెల లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా డీఏపీ బస్తా అసలు ధర రూ. 4,488 కాగా, కేంద్రం సబ్సిడీతో రైతులకు కేవలం రూ. 1,350 కే అందిస్తోంది. అలాగే రూ. 2,800 పైగా ఉన్న యూరియా బస్తాను కేవలం రూ. 266.50 కే ప్రభుత్వం ఇస్తోంది.
అసలు సమస్య ఎక్కడంటే కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల, రైతులంతా సహజంగానే తక్కువ ధరకు వచ్చే యూరియా, డీఏపీ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ఖరీఫ్ సీజన్ ఊపందుకునే సరికి వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. మార్కెట్లో తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతాంగం ఎక్కువగా నమ్ముకునే గంధకం ఉండే రకం ఎరువు బస్తా భారీగా పెరిగింది. ధరపై యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది. గత ఏడాది పాత ధరలతో పోలిస్తే ఇది ఏకంగా 133 శాతం వరకు పెరిగింది. కొన్ని కంపెనీలు రూ. 2,100 నుండి రూ. 2,200 మధ్య అమ్ముతున్నాయి. మరికొన్ని కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి.
ఎరువుల తయారీకి అవసరమైన ఫాస్ఫారిక్ యాసిడ్, అమ్మోనియా, ఎంఓపీ ధరలు అంతర్జాతీయంగా సగటున 20 శాతానికి పైగా పెరిగాయి. వీటికి తోడు సల్ఫర్ ధర ఏకంగా 133 శాతం పెరిగింది. చైనా దేశం ఎగుమతులపై నిషేధం విధించడం, ఇరాన్, ఖతార్ దేశాల నుండి అమ్మోనియా సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
{{/usCountry}}ఎరువుల తయారీకి అవసరమైన ఫాస్ఫారిక్ యాసిడ్, అమ్మోనియా, ఎంఓపీ ధరలు అంతర్జాతీయంగా సగటున 20 శాతానికి పైగా పెరిగాయి. వీటికి తోడు సల్ఫర్ ధర ఏకంగా 133 శాతం పెరిగింది. చైనా దేశం ఎగుమతులపై నిషేధం విధించడం, ఇరాన్, ఖతార్ దేశాల నుండి అమ్మోనియా సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
{{/usCountry}}మార్కెట్లో రోజురోజుకూ రేట్లు మారుతున్నా, ఏ ఎరువు ధర ఎంత పెరిగిందనే కనీస సమాచారం వ్యవసాయ శాఖ నుండి రైతులకు అందడం లేదు. గ్రామీణ స్థాయిలోని అధికారులకు సైతం ఈ ధరల పెంపుపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకు (ఎమ్మార్పీ కంటే ఎక్కువకు) విక్రయించే ప్రమాదం ఉంది.
తక్షణమే ప్రభుత్వం స్పందించి పెరిగిన కాంప్లెక్స్ ఎరువులపై కూడా అదనపు రాయితీలు ప్రకటించాలని రైతన్నలు కోరుతున్నారు. ధరలు తగ్గించకపోతే, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో అన్నదాతలకు కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.