...
...
Next Story

గోదావరికి కొనసాగుతున్న వరద - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Published on: Sep 27, 2026, 05:12:57 IST
Advertisement

గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ధవళేశ్వరం వద్ద గోదావరి
ధవళేశ్వరం వద్ద గోదావరి

శనివారం రాత్రి సమయానికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నదిలోకి వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువన ఉన్న సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

మరింత పెరగనున్న ప్రవాహం….

ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో ఆదివారం(ఇవాళ) నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రవాహం దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్కుల స్థాయికి చేరుకుంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే, ఈ గరిష్ఠ ప్రవాహం నమోదైన అనంతరం క్రమంగా వరద ఉధృతి తగ్గు ముఖం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

వరద ముప్పు ఎదుర్కొనేందుకు మరియు అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దించింది. ఈ బృందాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు…

వరద ప్రభావంతో పాటు ఆదివారం(ఇవాళ) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks