ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిపోయిన పెళ్లి భోజనం తినడంతో 10 మంది చిన్నారులతో సహా 60 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్‌లోని బుడగ జంగల కాలనీలో కొందరు వచ్చి.. మిగిలిపోయిన పెళ్లి భోజనం పంచారు.

వివాహ వేడుకలో మిగిలిపోయిన ఆహారాన్ని స్థానికులు తినడంతో వారికి వాంతులు, విరోచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో వైఎస్ఆర్ నగర్‌కు చెందినవారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉండగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే.. మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి ఆసుపత్రిని సందర్శించారు. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారుల నుంచి సమాచారం కోరారు.
మిగిలిపోయిన పెళ్లి భోజనం తిని.. ప్రభావితమైన వారందరికీ ఉత్తమ వైద్యం అందించాలని మంత్రి జనార్దన్ ఆదేశించారు. కొందరు ప్రవైట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. మరికొందరికి ఇంటి వద్దే వైద్యం కూడా చేస్తున్నారు అధికారులు.
ఫుడ్ పాయిజన్‌కు కారణంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మిగిలిపోయిన పెళ్లి భోజనం తినడం కారణంగా అస్వస్థతకు గురైనట్టుగా ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఘటనపై స్థానిక మహిళ మాట్లాడారు. పెళ్లి భోజనాలు మిగిలాయని ఆటోలో తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత వారిలో కొంతమంది కడుపునొప్పితో బాధపడుతూ, వాంతులు చేసుకున్నారు. మంగళవారం కూడా కొందరికి ఇలాగే జరిగింది. ఇంట్లోనే తగ్గుతుందని కొందరు పెద్దగా పట్టించులేదు. తర్వాత పరిస్థితి విషమించి.. ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టారని మహిళ వెళ్లడించారు.
{{/usCountry}}ఈ ఘటనపై స్థానిక మహిళ మాట్లాడారు. పెళ్లి భోజనాలు మిగిలాయని ఆటోలో తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత వారిలో కొంతమంది కడుపునొప్పితో బాధపడుతూ, వాంతులు చేసుకున్నారు. మంగళవారం కూడా కొందరికి ఇలాగే జరిగింది. ఇంట్లోనే తగ్గుతుందని కొందరు పెద్దగా పట్టించులేదు. తర్వాత పరిస్థితి విషమించి.. ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టారని మహిళ వెళ్లడించారు.
{{/usCountry}}