పీ4లో బీసీ యువతకు ఫ్రీ సివిల్స్ కోచింగ్.. త్వరలో డీఎస్సీకి కూడా

బీసీ యువత ఉన్నత స్థానాల్లో కొలువుదీరాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు.

Published on: Oct 12, 2026, 22:20:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్‌లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సవిత సమక్షంతో డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

మంత్రి సవిత
మంత్రి సవిత

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీలను అన్ని రంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా బీసీల కులాల సంక్షేమానికి పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. బీసీ యువత ఉన్నత స్థానాల్లో కొలువుదీరాలన్న ఉద్దేశంతో సివిల్స్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు.

సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 మోడల్‌లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించడానికి దేశంలో ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమన్నారు మంత్రి సవిత. ఈ సివిల్స్ శిక్షణ సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య అకాడమీ మెటీరియళ్లతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో వివిధ సబ్జెక్టులపై బోధన అందించనున్నారన్నారు.

2014-19లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఉచిత సివిల్స్ కోచింగ్ నిలిపేసిందన్నారు. దీంతో బీసీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉచిత సివిల్స్ కోచింగ్ ను పునరుద్ధించిందన్నారు. గడిచిన రెండేళ్లలో 200 మందికి ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేశామన్నారు. 2025 మెగా డీఎస్సీకి, గ్రూప్ 1కు కూడా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. త్వరలో సివిల్స్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నామన్నారు.

ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వంద మందికి ఉచిత వసతితో కూడిన శిక్షణ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ అందజేయనున్నామన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

పీ4 ఫౌండేషన్ వైఎస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ, ఉచిత సివిల్స్ కోచింగ్ మెయిన్స్‌కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు రూ.రెండు లక్షల చొప్పున వ్యక్తిగతంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పీ4 విధానంలో బీసీలను అన్నిరంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ లక్ష్మయ్య మాట్లాడుతూ, బీసీ విద్యార్థులకు సివిల్స్‌కు మెరుగైన శిక్షణ అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా కలిసి, వారికి శిక్షణ ఇస్తామన్నారు. ఏపీ గెజిటెడ్ జేఏసీ ఛైర్మన్ కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ, తమ ఉద్యోగ సంఘ తరఫున పలువురు విద్యార్థులకు పీ4 విధానంలో సివిల్స్ కోచింగ్ అందజేస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలపై బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిదులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More