బాలల దినోత్సవం(Children's Day) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల చిన్నారులకు ప్రత్యేక కానుకను ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జూపార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలు చూసుకుంటే.. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా వన్యప్రాణులను వీక్షించే అవకాశం కల్పించడం. వివిధ రకాల జంతువుల జాతులు, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ సమతుల్యతలో వాటి ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేస్తారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఉచిత ప్రవేశ సదుపాయం కేవలం నవంబర్ 14వ తేదీ (శనివారం) ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రమే టికెట్ మినహాయింపు వర్తిస్తుంది. జూపార్క్‌లోకి వచ్చే సందర్శకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకురాకూడదని, జంతువులకు ఆహారం వేయడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకుండా జూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
తూర్పు కనుమల సహజ సిద్ధమైన అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉన్న విశాఖ జూపార్క్ పర్యాటకులను, ముఖ్యంగా పిల్లలను ఎంతో ఆకట్టుకుంటుంది. బాలల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను జూపార్క్‌కు తీసుకువచ్చి, వారికి విజ్ఞానంతో కూడిన వినోదాన్ని అందించాలని జూ క్యూరేటర్ జి. మంగమ్మ కోరారు.
'విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. వన్యప్రాణులను అన్వేషించడానికి, వివిధ జంతు జాతులను గమనించడానికి, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి పిల్లలకు అవకాశం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఉచిత ప్రవేశ ఆఫర్ నవంబర్ 14న మాత్రమే చెల్లుబాటు అవుతుంది.' అని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ప్రకటించారు.
{{/usCountry}}'విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. వన్యప్రాణులను అన్వేషించడానికి, వివిధ జంతు జాతులను గమనించడానికి, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి పిల్లలకు అవకాశం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఉచిత ప్రవేశ ఆఫర్ నవంబర్ 14న మాత్రమే చెల్లుబాటు అవుతుంది.' అని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ప్రకటించారు.
{{/usCountry}}