Garikapati : గరికపాటి 'కోడిగుడ్డు' కామెంట్స్.. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ!

Garikapati Comments : ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారితీశాయి. కొందరు సమర్థిస్తుంటే.. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

Published on: Mar 22, 2026, 15:16:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవనీయమైన, గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరు. ఆయన హిందూ ధర్మ విలువలను, అలాగే సాధారణంగా మానవ ప్రవర్తనా విషయాలను బోధించే విధానం చాలా మందికి నచ్చుతుంది. జీవితానికి కావాల్సిన విషయాలను చక్కగా చెబుతుంటారు. ప్రస్తుత తరానికి కూడా అర్థమయ్యేలా.. ఫన్నీగా వివరిస్తారు.

గరికపాటి
గరికపాటి

అయితే ఈ తెలుగు పండితుడి తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గరికపాటి వివాదాస్పద వైఖరిని వ్యక్తం చేస్తూ కనిపించారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇలాంటి భోజనం అందించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

'విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, భోజనం అందించడానికి ప్రభుత్వం ఎందుకు డబ్బు ఖర్చు చేయాలి? అంతేకాక, ఈ మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు ఇవ్వడం అర్థరహితమైన నిర్ణయం. ఈ విద్యార్థులు చదువుకోవాలంటే వారి ఇళ్ల నుంచే ఆహారం తెచ్చుకోవాలి. వాళ్లు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, లేకపోతే వెళ్లిపోవచ్చు. వాళ్లను ఎవరూ ఆపడం లేదు.' అని గరికపాటి ప్రసంగంలో చెప్పారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ బాధ్యత కానీ, యూనిఫాంలు, పుస్తకాలు, ఆహారం ఇవ్వడం కాదని గరికపాటి వ్యాఖ్యలు ఉన్నాయి. 'మీరు విద్యార్థులకు ఇవన్నీ అందిస్తే, వారు శోభనం పెళ్లికొడుకులాగా తయారవుతారు.' అని కామెంట్స్ చేశారు.

ఈ విషయంలో గరికపాటి తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చు. కానీ కొడిగుడ్డు గురించిన వ్యాఖ్యలు, విద్యార్థులకు ప్రాథమిక మధ్యాహ్న భోజనం అందించాల్సిన అవసరాన్ని ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. చాలా మంది గరికపాటిని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం పరిపాలనా విధులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థులకు ప్రాథమిక భోజనం అందించడం సమస్య కాదని చాలా మంది అంటున్నారు.

పేదరిక సూచికను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలలకు పంపించగలిగే స్థితిలో లేరని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యూనిఫాం, ఆహారం, పుస్తకాలను అందించడం ద్వారా అధిక సంఖ్యలో నిరుపేద ప్రజలు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించవచ్చని చెబుతున్నారు.

మధ్యాహ్న భోజన పథకంపై తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి అభివర్ణించారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో విద్యార్థుల నమోదును మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేట్లను తగ్గించడానికి ప్రభుత్వాలకు సహాయపడిందని అనేక అధ్యయనాలు చూపించాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పిల్లలు గుడ్ల కోసమే పాఠశాలకు వెళ్తున్నారని, విద్య అర్థరహితంగా మారిందని గరికపాటి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. మరోవైపు కొందరు గరికపాటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More