గోదావరి వద్ద స్వల్పంగా తగ్గిన వరద ఉధృతి - ఈ జిల్లాలకు వర్ష సూచన

గోదావరి నదిలో వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.71లక్షల క్యూసెక్కులుగా నిలకడగా కొనసాగుతోంది.

Published on: Sep 29, 2026, 05:12:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గోదావరి నదిలో వరద ప్రవాహం సోమవారం సాయంత్రానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలు నమోదు అవుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….. సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36.4 అడుగులకు చేరగా, కూనవరం వద్ద 17.8 మీటర్లు, పోలవరం వద్ద 11.7 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

స్వల్పంగా తగ్గిన గోదావరి వరద
స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం ప్రస్తుతం నిలకడగా ఉంది. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా 9.71 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి మరింతగా తగ్గే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే… నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, తీర ప్రాంత వాసులు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కలవర్టులు మరియు కాజ్‌వేలను దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని, ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

పలు జిల్లాలకు వర్ష సూచన

ఇవాళ (సెప్టెంబర్ 29, 2026) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, మరియు వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఇక తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయి.

సెప్టెంబర్ 30 ఉదయం నుంచి అక్టోబర్ 2 ఉదయం వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్పప్పటికీ, అక్టోబర్ 2 నుంచి మళ్లీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More