ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ మైన్ కెనాల్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుధవారం) విడుదల చేయనున్నారు. పాయకరావుపేట వద్ద నిర్మించిన రెగ్యులేటర్‌ను ఆన్ చేసి….. గోదావరి తల్లికి 'జల హారతి' ఇచ్చి స్వాగతం పలకనున్నారు.
సాగు, తాగు నీరు….

ఈ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదలతో ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో ప్రయోజనం చేకూరనుంది. వివిధ ఆయకట్టుల పరిధిలో మొత్తం 2,87,320 ఎకరాలకు నిలకడైన సాగునీరు అందడమే కాకుండా, దాదాపు 5.23 లక్షల మంది జనాభాకు తాగునీటి ఎద్దడి తీరుతుంది. పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ నీరు ఎంతో దోహదపడనుంది.
పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 4,192 కోట్లు వ్యయం చేసింది. ఈ కాలువ నిర్మాణం ఏమాత్రం సాధారణమైనది కాదు. తూర్పు కనుమలను తొలిచి, అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, కొండలు, లోయలను అధిగమిస్తూ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
ఈ మార్గంలో ఉన్న ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక స్థానిక నదులను దాటుకుంటూ గోదావరి జలాలు ప్రవహిస్తాయి. నదుల ప్రవాహానికి అడ్డులేకుండా కాలువను తరలించేందుకు అనేక చోట్ల సైఫన్లు, అక్విడెక్టులను నిర్మించారు.
- ఏలేరు నది వద్ద సైఫన్ : ఏలేరు నది బెడ్ లెవెల్ కంటే దిగువ నుంచి గోదావరి జలాలను తరలించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక సైఫన్ నిర్మించింది.
- పంపా నదిపై అక్విడెక్ట్ : పంపా నది ఎగువ భాగం నుంచి కాలువ వెళ్లేలా 30 మీటర్ల లోతు వరకు తవ్వి, 312 పైల్స్‌తో బలమైన పునాదులు వేసి అక్విడెక్ట్ నిర్మించారు.
- తాండవ నదిపై అక్విడెక్ట్ : సుమారు 10,634 క్యూసెక్కుల ఉధృత ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున భారీ అక్విడెక్ట్ నిర్మించి ఇంజనీరింగ్ ప్రతిభను చాటారు.
- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించి, నిర్వాసితులైన 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.
పాయకరావుపేట అక్విడెక్టు నుంచి విడుదల చేసే జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో అనకాపల్లి జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నేరుగా మేలు జరుగుతుంది. పుష్కర ఆయకట్టు పరిధిలోని 1.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ చెందుతాయి.
{{/usCountry}}పాయకరావుపేట అక్విడెక్టు నుంచి విడుదల చేసే జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో అనకాపల్లి జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నేరుగా మేలు జరుగుతుంది. పుష్కర ఆయకట్టు పరిధిలోని 1.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ చెందుతాయి.
{{/usCountry}}ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలు, పంపా పరిధిలో 12,000 ఎకరాలు, తాండవ, వరాహ, మామిడిగెడ్డ పరిధిలో 46,620 ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను తరలించి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
మొత్తంగా 213 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఈ ఎడమ కాలువ ద్వారా భవిష్యత్తులో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అంతేకాకుండా, ఈ ఎడమ కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అనుసంధానించేలా రాష్ట్ర కూటమి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు నిరూపించింది. ఈ అనుసంధానం పూర్తయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు ఉచితంగా గోదావరి నీరు పారుతుంది. తద్వారా మొత్తం ఉత్తరాంధ్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు శాశ్వత సాగు, తాగునీటి సమస్య తీరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.