...
...
Next Story

అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. అమిత్ షాతో భేటీలో చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంమంత్రిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జీ-రామ్-జీ స్కీం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Published on: Jan 8, 2026, 05:33:56 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని.. ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యల గురించి అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలపై చర్చించుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe