Stop Wash and Go : రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్-వాష్ అండ్ గో కార్యక్రమం

Stop Wash and Go : రోడ్డు ప్రమాదాల నివారణకు గుంటూరు పోలీసులు స్టాప్-వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివలన ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Published on: Sep 3, 2026, 07:43:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుంటూరు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని మెుదలుపెట్టారు. దీనిద్వారా డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారని, తద్వారా ప్రమాదాలు జరగవని భావిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్ వాకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పహారా, వాహన తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు టోల్‌గేట్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైవే పెట్రోల్ బృందాలు రాత్రి నుండి తెల్లవారుజాము వరకు నిరంతరంగా గస్తీ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నాయి.

రాత్రిపూట ఎక్కువసేపు ప్రయాణించే లారీ, బస్సు, ఇతర వాహన డ్రైవర్లకు అలసట వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి పోలీసులు “ఆగు – కడుక్కో, వెళ్ళు(స్టాప్ – వాష్ అండ్ గో) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అంటే డ్రైవర్లు నిర్ణిత పార్కింగ్ స్థలంలో డ్రైవర్లు కొద్దిసేపు ఆగి, విశ్రాంతి తీసుకుని, నీటితో ముఖం కడుక్కొని, అప్రమత్తమైన తర్వాతే తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలని సూచిస్తున్నారు. తర్వాత యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారు.

అలసిపోయిన డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో లేదా సురక్షిత విశ్రాంతి కేంద్రాలలో మాత్రమే పార్క్ చేయాలని పోలీసులు కోరారు. హైవే పక్కన పార్కింగ్ చేయడం వల్ల ఇతర రహదారి వినియోగదారులకు తీవ్ర ప్రమాదం వాటిల్లవచ్చని హెచ్చరించారు.

అతివేగం, తప్పుడు మార్గంలో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వంటి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More