...
...
Next Story

GVMC : ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడానికి జీవీఎంసీ ప్లానింగ్.. ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లు

GVMC : ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎక్కడికక్కడ ఫ్రీ లెఫ్ట్‌లను ఏర్పాటు చేయనుంది.

Published on: Apr 3, 2026, 05:38:20 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నంలోని ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్‌ టర్న్‌లను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం విమ్స్ ఆసుపత్రి నుండి విశాఖ వ్యాలీ స్కూల్ జంక్షన్ మీదుగా హనుమంతవాక జంక్షన్ వరకు ఉన్న తూర్పు జోన్ మార్గాన్ని తనిఖీ చేశారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జాతీయ రహదారిపై, ముఖ్యంగా హనుమంతవాక, విశాఖ వ్యాలీ జంక్షన్ మధ్య తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని చెప్పారు.

జీవీఎంసీ
జీవీఎంసీ

వాహన, పాదచారుల రాకపోకలను మెరుగుపరచడానికి ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లను ప్రవేశపెట్టాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఈ ప్రతిపాదనపై జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు మెుదలుపెట్టారు. ఆదర్శ్ నగర్ ఓల్డ్ డెయిరీ ఫామ్ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ టర్న్‌ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కోసం జాతీయ రహదారుల అథారిటీతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. దీనితోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లను ప్లాన్ చేయనున్నారు.

సర్వీస్ రోడ్డు విస్తరణకు వీలు కల్పించి, రద్దీని తగ్గించడానికి ఆదర్శ్ నగర్–ఇందిరా నగర్ మార్గంలో ఒక డ్రెయిన్‌ను నిర్మించాల్సిన అవసరాన్ని కూడా జీవీఎంసీ కమిషనర్ చెప్పారు. విశాలాక్షి నగర్ 1వ, 2వ రోడ్లు, కైలాసగిరి రోడ్డులో ట్రాఫిక్ మెరుగుదల కోసం కూడా ప్రణాళికలు చేశారు.

ఇదిలా ఉండగా ప్రజల సౌకర్యం, సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు హనుమంతవాక జంక్షన్ సమీపంలో ఫౌంటెన్‌తో కూడిన సుందరమైన పచ్చని ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ శాంతిరాజును కమిషనర్ ఆదేశించారు.

అనంతరం.. వెటర్నరీ కాలనీ(వార్డ్ నెం. 9)లో పారిశుధ్యాన్ని సమీక్షించారు. ఉదయం 5.30 గంటల నుండి కార్మికుల హాజరును కఠినంగా పర్యవేక్షించాలన్నారు. స్థానిక నివాసితులతో సంప్రదించిన తర్వాత ప్రతిరోజూ వ్యర్థాలను తొలగించేలా చూడాలని ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe