ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(HSL) మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(VPA) కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న 60 టన్నుల బోలార్డ్ పుల్ టగ్ నౌక 'VC 11206' నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన కీలకమైన కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని వీపీఏ ఛైర్‌పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

గతేడాది డిసెంబర్‌లో ఈ టగ్ నౌకల తయారీ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో స్టీల్ కటింగ్ నిర్వహించి, ప్రస్తుతం అనుకున్న సమయానికి కీల్ లేయింగ్ పూర్తి చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా నిర్మిస్తున్న మొదటి టగ్ నౌక తయారీ ఇప్పటికే 60 శాతం పూర్తికాగా, రెండో దాన్ని కూడా అంతే వేగంగా పూర్తిచేసి రాబోయే అక్టోబరు మాసంలో రెండింటినీ ఒకేసారి నీటిలోకి ప్రవేశపెట్టనున్నారు.
1970లో వీపీఏ కోసం నిర్మించిన లాంచ్ శాంతి అనే నౌక నుంచి ఇప్పటివరకు హెచ్‌ఎస్‌ఎల్ విశాఖ పోర్ట్ కోసం తయారుచేస్తున్న 13వ నౌక ఇది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. భారీ సరకు రవాణా నౌకలు పోర్ట్‌లోకి వచ్చినప్పుడు, వాటిని సురక్షితంగా ఒడ్డుకు(బెర్త్‌కు) తీసుకురావడానికి లేదా వెనక్కి తోయడానికి ఈ టగ్ నౌకలను ఉపయోగిస్తారు.
60 టన్నుల లాగుడు సామర్థ్యం(Bollard Pull) ఉన్న ఈ ఆధునిక టగ్ నౌకల వల్ల నౌకాశ్రయంలోకి వచ్చే ఓడల నిలిపివేత వేగంగా పూర్తవుతుంది. నౌకలు పోర్ట్‌లో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించి పోర్ట్ సమర్థతను పెంచుతాయి. ప్రతికూల వాతావరణంలో కూడా భారీ నౌకలను సురక్షితంగా లాగడానికి ఇవి సహాయపడతాయి.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఛైర్‌పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా మాట్లాడుతూ.. "విశాఖపట్నం నగరానికి హెచ్‌ఎస్‌ఎల్, వీపీఏలు రెండు వారసత్వ చిహ్నాలు. 90 ఏళ్లకు పైగా దేశ సేవలో నిమగ్నమైన ఈ రెండు సంస్థలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు అనుగుణంగా పనిచేస్తున్నాయి.' అని కొనియాడారు.
{{/usCountry}}విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఛైర్‌పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా మాట్లాడుతూ.. "విశాఖపట్నం నగరానికి హెచ్‌ఎస్‌ఎల్, వీపీఏలు రెండు వారసత్వ చిహ్నాలు. 90 ఏళ్లకు పైగా దేశ సేవలో నిమగ్నమైన ఈ రెండు సంస్థలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు అనుగుణంగా పనిచేస్తున్నాయి.' అని కొనియాడారు.
{{/usCountry}}హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) చంద్రశేఖరన్ రఘురామ్ మాట్లాడుతూ.. వీపీఏతో రాబోయే రోజుల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. 60 టన్నుల ఎలక్ట్రిక్ టగ్ తయారీ, గ్రీన్ ఫ్లీట్‌గా మార్చే ప్రక్రియ, హెచ్‌ఎస్‌ఎల్ డ్రై డాక్‌ను ఉపయోగించుకుని దీర్ఘకాలిక నౌకల మరమ్మతు ఒప్పందంపై ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో దుగరాజపట్నం వద్ద నూతన షిప్‌బిల్డింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు ఆలోచన ఉందని రఘురామ్ వెల్లడించారు.