ఓవైపు వరుస సెలవులు… అందులోనూ వీకెండ్..! అంతేకాకుండా ఇయర్ ఎండ్ కావటంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు పర్యాటకులు క్యూ కట్టారు. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అరకు లోయంతా కూడా టూరిస్టులతో కిక్కిరిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి.
హోటళ్లకు భారీ డిమాండ్…

భారీగా టూరిస్టుల వస్తుండటంతో… అరకు లోయలో హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు… టూరిస్టులు తెగ తరలివ్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.
బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు భారీగా వస్తున్నారు.
ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
టైమింగ్స్ మార్పు…
ఇక అరకు వ్యాలీలో ఇటీవల ప్రాధాన్యత సంతరించుకున్న టూరిస్ట్ స్పాట్స్ లో ఉడెన్ బ్రిడ్జ్ ఒకటిగా నిలిచింది. సుంకరమెట్ట సమీపంలో ఇది ఉంటుంది. అయితే ప్రస్తుతం టూరిస్టుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, ఆపై మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ బ్రిడ్జిని సందర్శించవచ్చు. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు బ్రిడ్జ్ సందర్శనకు అనుమతి ఉండదు.
{{/usCountry}}ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, ఆపై మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ బ్రిడ్జిని సందర్శించవచ్చు. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు బ్రిడ్జ్ సందర్శనకు అనుమతి ఉండదు.
{{/usCountry}}పర్యాటక శాఖ అధికారుల ప్రకారం… నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు జిల్లాల్లోని హోటళ్లు పూర్తిగా నిండిపోయి. ఈ ట్రెండ్ సంక్రాంతి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉంది.