అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో ఈ 2 రోజులు వర్షాలు..! ఐఎండీ అంచనాలివే

ఏపీకి ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉపరితల అవర్తనం, అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు ఉన్నాయని పేర్కొంది.

Published on: Feb 20, 2026, 15:07:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో చలి తీత్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...నైరుతి బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడనం ఇవాళ బలహీనపడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతోలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదిలే అవకాశం ఉంది.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తువ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది కొనసాగుతుండగా.... ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఇదే ప్రాంతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

ఏపీకి వర్ష సూచన...

ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరం లేదా పలుచోట్ల పొగమంచు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఇక రాయలసీమలో చూస్తే... ఇవాళ పొడి వాతావరం ఉంటుంది. రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఎల్లో, ఆరెంజ్, రెడ్ వంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది

ఇవాళ రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదు. కోస్తాంధ్రలో రాగల 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More