ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. వచ్చే వారం రోజుల వర్ష సూచన ఇదే!

అర్నబ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు మోస్తరు నుంచి అధిక స్థాయి ఆకస్మిక వరదల ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు వారం రోజుల వాతావరణ అప్డేట్ ఇచ్చింది.

Published on: Oct 28, 2026, 19:25:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అర్నబ్ తుపాన్(Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ముప్పును ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు, యానాం ప్రాంతాలకు వ్యాపించేలా గురువారం ఉదయం 5.30 గంటల వరకు స్వల్పం నుండి తీవ్ర స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరదలు) వచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పరిధిలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ ఫ్లాష్ ఫ్లడ్స్
ఏపీ ఫ్లాష్ ఫ్లడ్స్

వాతావరణ శాఖ ప్రకారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, జలాశయాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరితోపాటుగా యానాం ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో నివాసిత ప్రాంతాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని నిపుణులు అప్రమత్తం చేశారు.

బుధవారం ఉదయం 8.00 గంటల సమయానికి అర్నబ్ తుపాన్ తీరం దాటింది. వచ్చే 48 గంటల్లో ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడనుంది. తదుపరి 6 గంటల్లో సాధారణ తుపాన్‌గా ఆ తర్వాత మరో 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.

బుధవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన గాలి వేగం, వర్షపాతం వివరాలు చూస్తే..గాలి వేగం మచిలీపట్నం – 96 కి.మీ/గంట, విశాఖపట్నం, కాకినాడ – 80 కి.మీ/గంట, కళింగపట్నం – 70 కి.మీ/గంట, బాపట్ల – 45 కి.మీ/గంట, కావలి – 32 కి.మీలుగా గంటకు వేగం ఉంది.

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా గరివిడి 26 సెంటీమీటర్లు, అనకాపల్లి, శృంగవరపు కోట, వేపాడ, చీపురుపల్లిలో 25 సెంటీమీటర్లు, భీమునిపట్నం, మెంటాడ, ఎలమంచిలిలో 24 సెంటీమీటర్లు, గంట్యాడ, రణస్థలంలో 23 సెంటీమీటర్లు, గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖపట్నం సిటీ, మెరకముడిదాంలో 22 సెంటీమీటర్లు, చోడవరం, బొండపల్లిలో 21 సెంటీమీటర్లుగా వర్షాపాతం నమోదైంది.

ఏడు రోజుల వర్ష సూచన

అక్టోబర్ 29 (గురువారం) కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, రాయలసీమతో పాటు కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3 వరకు ఈ రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. నవంబర్ 1, 2, 3 తేదీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది. నవంబర్ 1 వరకు గంటకు 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అక్టోబర్ 29 ఉదయం నుంచి అక్టోబర్ 30 ఉదయం వరకు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర తమిళనాడు తీరాల్లో 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

అర్నబ్‌ తుపాన్ సృష్టించిన నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను ఫోన్‌లో సంప్రదించారు. రాష్ట్రంలో విపత్తు పరిస్థితి, నష్ట తీవ్రతను వివరించిన సీఎం, ముంపు ప్రాంతాల్లో తక్షణ రక్షణ, పునరావాసం, పునర్నిర్మాణ చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక, సహాయక బృందాల మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More