వెదర్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. విజయవాడలో రహదారులు జలమయం

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు విజయవాడలో రహదారులు జలమయమయ్యాయి.

Published on: Jun 11, 2026, 12:52:10 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ నెలలో తీవ్రమైన ఎండల తర్వాత, బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8.30 గంటల నుండి గురువారం (జూన్ 11, 2026) ఉదయం 8.30 గంటల మధ్య ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఉత్తర ప్రాంతంలో అత్యధికంగా 102 మి.మీ వర్షపాతం నమోదైంది, ఆ తర్వాతి స్థానంలో NTR జిల్లాలోని ఉటుకూరు (84 మి.మీ) నిలిచింది.

విజయవాడ రహదారులపై నీరు
విజయవాడ రహదారులపై నీరు

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తెనాలిలో వరుసగా 82 మి.మీ, 66.75 మి.మీ వాన పడింది. శ్రీకాకుళం జిల్లాలోని గరికిపాడులో 72.5 మి.మీ, కృష్ణా జిల్లాలోని పెద అవుటపల్లి, మచిలీపట్నంలో వరుసగా 60.5 మి.మీ, 50.75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా అధికారుల సమాచారం ప్రకారం, ఈ సమయంలో తిరువూరులో 109.6 మి.మీ వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంబా అప్డేట్ చేయలేదు.

గురువారం ఉదయం విజయవాడలోని నీట మునిగిన రైల్వే అండర్‌పాస్ గుండా ట్రాఫిక్ నత్తనడకన సాగింది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిలో బస్సులు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.

గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇందులో ఎక్కువ భాగం బుధవారం రాత్రే కురిసింది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, పెందుర్తితో సహా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, గురువారం మార్కాపురం, రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు పోలవరంలో పగటిపూట తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

'మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంతో గురువారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పిడుగులతోకూడిన వానలు పడతాయి. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.'అని రాష్ట్ర విపత్త నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More