...
...
Next Story

AP Weather Updates : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - ఈ జిల్లాలకు వర్ష సూచన, ఈదురుగాలుల హెచ్చరికలు

Andhrapradesh Weather Updates : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

Published on: Aug 17, 2026, 06:02:44 IST
Advertisement

Andhrapradesh Weather Updates : బంగాళాఖాతంలో వాతావరణం మారుతోంది. వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ‘స్పష్టమైన అల్పపీడనం’గా రూపాంతరం చెందిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది మరిన్ని గంటల్లో మరింత తీవ్రమై… బలమైన వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. రాగల మంగళవారం వరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున, మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు, సముద్రం వైపు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ(ఆగస్ట్ 17, 2026) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం ప్రాంతంతో పాటు విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా పలుచోట్ల తేలికపాటి జల్లుల నుండి వర్షం పడొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe