రైల్వే మంత్రిత్వ శాఖ రైలు సంఖ్య 17428/17427 నర్సాపూర్-తిరుపతి-నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతాయి. నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17428) ఏప్రిల్ 27 నుండి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-నర్సాపూర్ రైలు (రైలు సంఖ్య 17427) మే 3, 2026 నుండి ప్రతి ఆదివారం రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుంది.

ఈ రెండు రైళ్లు రాకపోకల మార్గాల్లోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రైలు సర్వీసులు పొడిగింపు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా పలు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయవచ్చు. సీజనల్ రష్‌ను నిర్వహించేందుకు అదనపు స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
- రైలు నెం. 06557 (SMVT బెంగళూరు – సంత్రాగాచి) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 24 వరకు శుక్రవారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06558 (శాంత్రగాచి – బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06207 (బెంగళూరు కంటోన్మెంట్ – కలబురగి) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 25 వరకు శనివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06208 (కలబురగి – బెంగళూరు కంటోన్మెంట్) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో (3 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06539 (SMVT బెంగళూరు – బీదర్) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు మరియు ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 26 వరకు శుక్రవారాలు, ఆదివారాలలో (6 సర్వీసులు) నడుస్తుంది.
- రైలు నెం. 06540 (బీదర్ – SMVT బెంగళూరు) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 13 వరకు, ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 27 వరకు శనివారాలు, సోమవారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది.
వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు కనెక్టివిటీని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు కనెక్టివిటీని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
{{/usCountry}}