AQI Bus : ఆంధ్రప్రదేశ్‌లో ఇండియాలోనే ఫస్ట్ AQI బస్సు సర్వీస్ ప్రారంభం.. ఈ రూట్‌లో నడుస్తోంది!

AQI Bus : విజయవాడలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సేవ ప్రారంభమైంది. ఇది ప్రయాణికుల ఆరోగ్యంపై దృష్టి పెట్టనుంది.

Published on: Mar 15, 2026 9:32 AM IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంటర్‌సిటీ మొబిలిటీ బ్రాండ్ అయిన ఇంటర్‌సిటీ స్మార్ట్‌బస్ విజయవాడ-బెంగళూరు మార్గంలో ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యంపై దృష్టి సారించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సేవలను ప్రారంభించింది. విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP - ట్రాఫిక్) షెరీన్ బేగం విజయవాడలో భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)-ఆధారిత ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బస్
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బస్

ఈ సందర్భంగా షెరీన్ బేగం మాట్లాడుతూ.. విజయవాడ-బెంగళూరు, బెంగళూరు-విజయవాడ కారిడార్‌లలో స్మార్ట్‌బస్ AQI సేవలను ప్రారంభించడం భారతదేశ రవాణా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.

ముఖ్యంగా దూర ప్రయాణాల సమయంలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి బస్సుల లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడంపై ఈ చొరవ దృష్టి సారించిందని పేర్కొన్నారు. 'సుదూర ప్రయాణాల సమయంలో ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో AQI ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ ప్రారంభించారు.' అని షెరీన్ చెప్పారు.

బస్సుల లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణీకులకు మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఇంటర్‌సిటీ నిర్వహించిన అంతర్గత అధ్యయనాల ప్రకారం, బస్సు క్యాబిన్‌ల లోపల వాయు కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సిఫార్సు చేసిన పరిమితుల కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

దీనిని పరిష్కరించడానికి కంపెనీ క్యాబిన్ గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి స్మార్ట్‌బస్ AQI సాంకేతికతను ప్రవేశపెట్టింది. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులు స్మార్ట్‌బస్ AQI అని ట్యాగ్ చేసిన బస్సులను ఎంచుకోవడం ద్వారా IntrCity మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రత్యేకంగా తయారుచేసిన బస్సులను బుక్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఏక్యూఐ, PM2.5 రీడింగ్‌లు బస్సు లోపల స్క్రీన్‌లపై అలాగే ప్రయాణ సమయంలో మొబైల్ యాప్‌లో కనిపిస్తాయి.

ఇంటర్‌సిటీకి చెందిన మనీష్ రతి మాట్లాడుతూ.. బెంగళూరు వంటి సుదూర మార్గాలకు డిమాండ్ ఉన్నందున విజయవాడ కీలకమైన ఇంటర్‌సిటీ ట్రావెల్ హబ్‌గా అవతరించిందని అన్నారు. ప్రయాణికులు ప్రయాణాల సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేయడం ఏక్యూఐ సేవ లక్ష్యమని పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More