...
...
Next Story

ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఆర్‌సీటీసీ మేజికల్ మేఘాలయ టూర్ ప్యాకేజీ.. అద్భుతాలు చూసి రావొచ్చు!

ఐఆర్‌సీటీసీ అనేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి మేజికల్ మేఘాలయ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

Published on: Dec 14, 2025, 16:42:17 IST
Advertisement

ఐఆర్‌సీటీసీ Magical Meghalaya Ex. Visakhapatnam టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో అద్భుతమైన ప్రదేశాలను చూసి రావొచ్చు. చిరపుంజి, గువాహటి, మావ్‌లిన్నాంగ్, ఖజిరంగ, షిల్లాంగ్‌లను చూడొచ్చు. 20 ఫిబ్రవరి 2026న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఆరు రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది.

మెుదటి రోజు

మేఘాలయ టూర్ ప్యాకేజీ
మేఘాలయ టూర్ ప్యాకేజీ

విశాఖపట్నం నుండి 6E - 6645/6882 విమానంలో 12:45 గంటలకు బయలుదేరుతారు. 06:50 గంటలకు గౌహతికి చేరుకుంటారు. గౌహతి విమానాశ్రయం నుండి పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

రెండో రోజు

అల్పాహారం తర్వాత, హోటల్ నుండి చెక్-అవుట్ చేసి బాలాజీ ఆలయం, కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం అవుతారు. హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. షిల్లాంగ్‌లోనే రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

మూడో రోజు

ఉదయం అల్పాహారం తర్వాత చిరపుంజికి ప్రయాణం అవుతారు. నోహ్కలికై జలపాతం, మాస్మాయి గుహలను సందర్శిస్తారు. సాయంత్రం షిల్లాంగ్‌కు తిరిగి వస్తారు. మార్గమధ్యంలో ఎలిఫెంటా జలపాతాన్ని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసి షిల్లాంగ్‌లోనే నిద్రపోతారు.

నాలుగో రోజు

ఉదయం అల్పాహారం తర్వాత ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం అయిన మావ్‌లిన్నాంగ్‌కు ప్రయాణం అవుతారు. లివింగ్ రూట్ బ్రిడ్జ్, డావ్కి సరస్సును సందర్శిస్తారు. సాయంత్రం షిల్లాంగ్‌కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం, బస షిల్లాంగ్‌లోనే ఉంటుంది.

ఐదో రోజు

అల్పాహారం తర్వాత, హోటల్ నుండి చెక్-అవుట్ చేసి ఖజిరంగకు వెళ్తారు. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం (ఖర్చు మీరే భరించాలి). ఖజిరంగలో హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఈశాన్య భారతదేశంలోని సంస్కృతి, జానపద సంగీతాన్ని చూసేందుకు ఆర్కిడ్ అండ్ బయో డైవర్సిటీ పార్కును సందర్శిస్తారు. హోటల్‌కు తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

ఆరో రోజు

అల్పాహారం తర్వాత హోటల్ నుండి చెక్-అవుట్ చేస్తారు. ఉదయం 10:00 గంటలకు విమానాశ్రయంలో దిగబెడుతారు. గౌహతి నుండి 12:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 07:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

మేజికల్ మేఘాలయ ఎక్స్ విశాఖపట్నం టూర్ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.69395, డబుల్ ఆక్యుపెన్సీ రూ.51385, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.48675, చైల్డ్ విత్ బెడ్ రూ.42625, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.33855గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe